![]() |
![]() |

ఫెమినిస్ట్ అని చెప్పుకుంటున్న వాళ్ళ మీద నటి మాధవి ఫుల్ ఫైర్ అయ్యింది. ప్రతీ ఒక్క మహిళా ఫెమినిస్ట్ అని చెప్పుకుంటున్నారు. ఫెమినిస్ట్ అంటే ఏంటి మగవాళ్ళతో సమానంగా చదువుకోవడం, ఉద్యోగం చేయడం అదే ఫెమినిజం అంటే. అంతే గాని ఇంకేం కాదు. ఇంకో విషయం ఏమిటి అంటే మహిళలు శారీరకంగా కొంత వీకర్ సెక్షన్ కాబట్టి ఈ న్యాయస్థానాలు మహిళల కోసం ఎన్నో రకాల సెక్షన్స్ పెట్టాయి. కానీ కొంత మంది ఆడవాళ్లు వాటిని దుర్వినియోగం చేస్తున్నారు. భర్తల మీద అన్యాయమైన కేసులు పెడుతున్నారు. ఆ భర్తలు కేసుల నుంచి బయట పడలేక అల్లాడిపోతున్నారు. రకరకాల ఫేక్ కేసులు పెట్టేసి మగాళ్లను హింసకు గురి చేస్తున్నారు.
కొంతమంది చేస్తున్న ఇలాంటి పనుల వలన నిజంగా బాధపడే అమ్మాయిలకు న్యాయం జరగడం లేదు..ఆ చట్టాలే కొంత మంది మహిళల వలన పల్చబడిపోయాయి. కోర్టుల్లో బోల్డు కేసులు మిగిలిపోతున్నాయి. దుర్మార్గమైన, స్వార్థపరులైన, ఆశాలెక్కువైన ఆడపిల్లల వలన చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అసలు ఇలాంటి వాళ్ళను ఆడోళ్లనడానికే సిగ్గుపడాలి. వరకట్నం తీసుకుని పెళ్లి చేసుకుంటున్నారు మగాళ్లు..కన్యాశుల్కం కూడా ఉందిగా మరి అది ఇచ్చి పెళ్లి చేసుకోవచ్చుగా అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుత సమాజంలో మగవాళ్ళు చాలా బెటర్ గా ఉన్నారు ఆడవాళ్లే చెడిపోతున్నారు. స్వేచ్ఛను వినియోగించుకోవాలి వేస్ట్ చేసుకోకూడదు..భారత దేశానికీ కష్టపడి స్వేచ్ఛను తెచ్చింది ప్రశాంతరంగా బతకడానికి మనకు మనమే బొక్కెట్టుకుని బానిసల్లా బతకడానికి కాదు అని చెప్పింది మాధవి.
![]() |
![]() |